Nandigama (U)(P) News

Posted by Bhhaskar on 23 Nov 2017 Views: 106

వ్యక్తిగత గోప్యత, ఆధార్‌ల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి భరోసా ఇస్తున్నారు. గురువారం జరిగిన సైబర్ స్పేస్‌పై అంతర్జాతీయ సదస్సులో మోదీ మాట్లాడుతూ బాహాటంగా వెల్లడించడం, జాతీయ భద్రత మధ్య సమతుల్యతను సాధించవచ్చునని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, బహిరంగతలను ఓ వైపు, జాతీయ భద్రతను మరోవైపు ఉంచి సరితూచవచ్చునని చెప్పారు.

ఉగ్రవాదం, రాడికలైజేషన్ వంటి చీకటి శక్తులకు క్రీడా స్థలంగా సైబర్ స్పేస్ మారకుండా దేశాల ప్రభుత్వాలు బాధ్యత వహించాలని మోదీ చెప్పారు.