Illuru News

Posted by Bhaskara Rao on 05 Jul 2017 Views: 25

యు ఆర్ మై ఎమ్మెల్యే’ అంటూ బన్నీ ఎప్పుడైతే క్యాథరిన్‌ను పొగిడాడో అప్పటి నుంచి ఫ్యాన్స్ కూడా ఆమెను ‘ఎమ్మెల్యే’ అంటూ పిలవడం మొదలుపెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా క్యాథరిన్‌కు అంత పేరు తెచ్చిపెట్టింది మరి. యంగ్ ఎమ్మెల్యేగా ఆ సినిమాలో ఆకట్టుకున్న క్యాథరిన్ ట్రెసా తొలిసారి జనం మధ్యలోకి వెళ్లారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌లో సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు.

అద్దంకి బస్టాండ్‌కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మొబైల్ షోరూంను ప్రారంభించేదుకు వచ్చిన క్యాథరిన్ అక్కడ భారీగా వచ్చిన జనాన్ని చూసి షాకయ్యారు. ఇలా ఓ షోరూం ఓపెనింగ్‌కు రావడం ఇదే మొదటిసారి అని, తనను చూసేందుకు ఇంతమంది అభిమానులు వస్తారని అసలు ఊహించలేదని క్యాథరిన్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులందరితో కలిసి వేదికమీద నుంచే గ్రూప్ సెల్ఫీ తీసుకున్నారు.