Illuru News

Posted by Bhaskara Rao on 08 Jul 2017 Views: 45

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత శ్రీలంకతో భారత్‌ పూర్తిస్థాయి సిరీస్‌ ఆడనుంది. 43 రోజుల లంక పర్యటన లో టీమిండియా 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ-20 మ్యా చ్‌ ఆడనుంది. 2009లో భారత్‌-శ్రీలంక పూర్తిస్థాయిలో 3 టెస్ట్‌లు, 5 వన్డేలు, రెండు టీ20ల సిరీస్‌లు ఆడాయి. టెస్ట్‌ సిరీస్‌ను 2-1తో, వన్డేలను 3-1తో భారత్‌ కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్‌ 1-1తో డ్రా అయింది. 2015 ఆగస్టులో లంక టూర్‌లో టీమిండియా 2-1తో టెస్ట్‌ సిరీస్‌ను నెగ్గింది.