Illuru News

అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్.. హీరో వెంకటేష్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడని ఓ వార్త వీరవిహారం చేస్తోంది.నాగార్జున మొదటిభార్య వెంకటేష్ చెల్లెలు. అంటే అఖిల్ వెంకీ కి వరుసకు అల్లుడు అవుతాడు. దీంతో ఈ వార్త నిజమే అంటున్నారు కొందరు గాసిప్ వీరులు. త్వరలో ఈ విషయాన్నిదగ్గుబాటి ఫామిలీ నుండి గానీ, అక్కినేని ఫామిలీ నుండి గానీ వినబోతున్నాం అని కూడా చెప్తున్నారు.అఖిల్ కి వెంకీ మామతో సాన్నిహిత్యం కూడా ఎక్కువగా ఉంటుంది.వీరిద్దరూ అప్పుడప్పుడూ కలుస్తూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుండటం ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది.రీసెంట్ గా అఖిల్ వివాహం శ్రేయా భూపాల్ తో జరుగుతుందనుకున్నా..కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం అఖిల్ తన రెండో సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇక అక్కినేని మరో వారసుడైన నాగచైతన్య వివాహం సమంతతో అక్టోబర్ 6న గోవా లో జరగనున్న సంగతి తెలిసిందే.