Illuru News

Posted by Bhaskara Rao on 02 Sep 2017 Views: 119

సమీపకాలంలో బాలీవుడ్‌ నుంచి దక్షిణాది వరకు యువతను అమితంగా ఆకట్టుకుంటున్న టీజర్‌ ఏదైనా ఉందంటే.. అది ‘జూలి2’ అని ఠక్కున చెప్పేయవచ్చు. ఆ స్థాయిలో తన అందంతో మెస్మరైజ్‌ చేస్తోంది కోలీవుడ్‌ బ్యూటీ రాయ్‌లక్ష్మి. పైగా, నగ్నంగా నటించిందన్న వార్తలతో ఈ చిత్రం విడుదల కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తోపాటు, ఇటీవలే విడుదలైన టీజర్‌లో రాయలక్ష్మి అందాల ఆరబోత ప్రస్తుతం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్‌ చిత్రం ఇదే కాగా, ఓవరాల్‌గా 50వ చిత్రం. ఐదు భాషల్లో గ్లామరస్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ పొడుగుకాళ్ల సుందరి ‘జూలీ2’పై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా విజయం సాధిస్తే బాలీవుడ్‌లోనే సెటిలైపోవాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజ వేయలేదట. అంతేకాదు, బికినీ పోస్టర్‌పై రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో... అసలు బికినీ ధరించడంలో తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తోంది ఈ గడుసరి భామ.