Illuru News

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద క్కక పోతే నిరుద్యోగుల పరిస్థితి పశువుల కన్నా హీనమని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా పేర్కొన్నారు. కడప కోటిరెడ్డి సర్కిల్లో శుక్రవారం వినూత్న రీతిలో ఎడ్లు లేకుండా విద్యార్థులే బండ్లను లాగుతూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ భృతి చెల్లిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రం ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. వైఎస్‌ హయాంలో ఒక్క ఐటీ రంగంలోనే 1.53 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని సాధ్యమవుతాయని, అది వైసీపీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు మహ్మదలి, దత్తసాయి, నిఖిల్‌, అల్లాబకాష్‌, నిత్యాతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.