Illuru News

Posted by Bhaskara Rao on 11 Sep 2017 Views: 90

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్‌లో పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీచ ర్స్‌ డే సందర్భాన్ని పురస్కరించుకొని గు రువులకు శుభాకాంక్షలు తెలిపిన విరాట్‌.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లను గుర్తుకు తెచ్చేలా ఒక ఫొటోను పోస్ట్‌ చేశాడు. వెనక కొందరు మాజీ క్రికెటర్ల పేర్లు కనిపిస్తుండగా వాటి ముందు కోహ్లీ కూర్చొని ఉన్న ఫొటో అది. అంతా బాగానే ఉందికానీ.. వాటిలో సునీల్‌ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లే పేర్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అనిల్‌ కుంబ్లేతో విభేదాల వల్ల అతని పేరు కావాలనే పెట్టి ఉండడని భావించినా.. గవాస్కర్‌ పేరు కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. కోహ్లీ పెట్టిన ఫొటోపై భారత్‌లో మిశ్రమ స్పందన వస్తుంటే.. దాయాది దేశం పాకిస్థాన్‌లో మాత్రం దానికి విపరీతమైన మద్దతు లభిస్తోంది. విరాట్‌ వెనక ఉన్న జాబితాలో పాక్‌ ఆటగాళ్లు ఇమ్రాన్‌ ఖాన్‌, జావేద్‌ మియాందాద్‌, ఇంజమాముల్‌ హక్‌ పేర్లు ఉండడంతో ఆ దేశ అభిమానులు పొంగిపోతున్నారు.